News March 6, 2025
మంచిర్యాల: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు శుభవార్త తెలిపారు. కరోనా సమయంలో రద్దు చేయబడిన బల్లార్షా-కాజీపేట-బల్లార్షా మధ్యలో నడుస్తున్న రైలు నంబర్ 17035,17036 ప్యాసింజర్ తిరిగి ఈ నెల 6 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి రాజనర్సు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్యాసింజర్ రైలు పునః ప్రారంభంతో పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 6, 2025
పేదరికం లేని సమాజమే సమాజమే లక్ష్యం: కలెక్టర్

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ4 సర్వే నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రామారావుతో కలిసి అధికారులు సిబ్బందికి వర్చువల్ సమావేశం నిర్వహించారు. పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రణాళికయుక్తంగా ముందుకు వెళుతుందన్నారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.