News March 6, 2025

సంగారెడ్డి: 31లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో LRS క్రమబద్ధీకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

Similar News

News October 27, 2025

వద్దన్నా.. బర్లీ పొగాకు సాగు చేస్తున్నారు

image

AP: సరైన ధర, కొనుగోలు లేనందున బర్లీ పొగాకు సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా రైతులు వెనక్కు తగ్గడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 21వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ప్రకాశం జిల్లాలో 11,400 ఎకరాల్లో, కర్నూలులో 4 వేలు, పల్నాడు జిల్లాలో 4,600 ఎకరాల్లో.. మరో 7 జిల్లాల్లో కొద్ది విస్తీర్ణంలో బర్లీ పొగాకును సాగు చేస్తున్నట్లు వెల్లడైంది. రైతులు ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారో అధికారులకు కూడా తెలియదు.

News October 27, 2025

ఆదిలాబాద్: KU.. ఫీజు చెల్లింపుకు నేడే ఆఖరు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 23 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి అవకాశం ఉండగా దానికి ఈనెల 27వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కావున ఫీజు చెల్లించని విద్యార్థులు గమనించి నేడు ఫీజు చెల్లించాలని సూచించారు.

News October 27, 2025

వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే..?

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,925 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం రూ.7 వేలకు పైగా పలికిన పత్తి ధర.. నేడు పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.