News March 6, 2025

వికారాబాద్: భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని నేషనల్ హైవే, వివిధ ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవేతో పాటుగా జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న రైతుల సమ్మతితో త్వరితగతిన భూ సేకరణ పూర్తిచేసి రైతులకు న్యాయం చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.12 % హాజరు

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 4,801 మందికి గాను 4,711 మంది, ఒకేషనల్ విభాగంలో 267 మందికి గాను 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 98.12 శాతం హాజరు నమోదైందని అధికారి మాధవి తెలిపారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు పూర్తయ్యాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.

News March 13, 2026

సింహాచలం వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లు ప్రారంభమయ్యాయి. ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిల్చునే పనిలేకుండా QR కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో దర్శన టికెట్లు పొందవచ్చు. కొండపైన గల బస్టాండ్, PRO కార్యాలయ ఆవరణలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సేవలను EO వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. భక్తులకు వేగంగా దర్శన భాగ్యం కల్పించడమే తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.

News March 13, 2026

ప్రెగ్నెన్సీలో కాస్మెటిక్స్ వాడితే ఏమవుతుందంటే?

image

ప్రెగ్నెన్సీ సమయంలో గాఢ రసాయనాలుండే పెర్‌ఫ్యూమ్‌లు, రూమ్ ఫ్రెషనర్లు, కాస్మెటిక్స్ వాడటం వల్ల ఎండోక్రైన్ సిస్టంపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. వీటివల్ల బిడ్డ పుట్టుకలో లోపాలు, ట్యూమర్లు, అండంలో పెరుగుదల లోపాలు వంటివి జరగవచ్చంటున్నారు. కొన్నిసార్లు అబార్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏవైనా వాడేముందు అందులో ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.