News March 6, 2025
మహ్మదాపూర్‌లో చోరీపై ఎస్పీ ఆరా

పాన్గల్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరగ్గా రూ.1.25లక్షలు, 20 తులాల వెండి గొలుసులు దొంగలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయులు ఇంటిని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఎస్సైతోపాటు సీఐ, ఎస్సై శ్రీనివాసులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 3, 2026
KMCలో అద్భుతం.. ఏళ్లనాటి నొప్పికి సొల్యుషన్

KMC సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెయిన్ మేనేజ్‌మెంట్ సేవలు విస్తరించాయి. 10 ఏళ్లుగా ట్రైజెమినల్ న్యూరాల్జియా(తీవ్రమైన ముఖం నొప్పి)తో బాధపడుతున్న రోగికి డా.చిలక మురళి బృందం మొదటిసారిగా ట్రైజెమినల్ గ్యాంగ్లియన్ బ్లాక్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ఔషధాలు పనిచేయని స్థితిలో ఈ ఆధునిక చికిత్సతో రోగికి ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని KMC ప్రిన్సిపల్ డా.సంధ్య ప్రత్యేకంగా అభినందించారు.
News April 3, 2026
TU: రేపటి నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 8వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 4, 7, 9, 13, 16 తేదీల్లో, 10వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 6, 8, 10, 15 తేదీల్లో జరగనున్నాయని పేర్కొన్నారు.
News April 3, 2026
హనుమాన్ జయంతి.. కరీంనగర్‌లో ప్రశాంతం

హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీ పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. సీపీ గౌష్ ఆలం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ర్యాలీ ప్రశాంతంగా సాగింది.


