News March 6, 2025

NZB: తండ్రి మృతితో ఆగిన కూతురి పెళ్లి

image

రుద్రూర్ మండలం బొప్పాపూర్‌కు చందిన సాయిలు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. సాయిలుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చిన్న కూతురిని పోతంగల్ మండలం హంగర్గేకర్ చెందిన యువకుడితో ఈ నెల 14వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పది రోజుల్లో వివాహం జరగనుండగా తండ్రి మృతితో కూతురి వివాహం ఆగిపోయింది. పెద్ద కుమర్తె భర్త చనిపోవడంతో ఆమె సైతం తండ్రి ఇంటి వద్దనే ఉంటుంది.

Similar News

News March 15, 2026

NZB: వారం రోజుల్లో 230 కేసులు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో (9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు) 230 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. 230 మందిని కోర్టులో హాజరు పరచగా రూ.21.60 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 14 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని CP వివరించారు.

News March 15, 2026

NZB: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

image

నిజామాబాద్ జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. శనివారం జీజీహెచ్‌‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.