News March 6, 2025
సంగారెడ్డి: ‘ఇంటర్ పరీక్షలకు 97.5% హాజరు’

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలలో నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 18,852 మంది విద్యార్థులకు గాను 18,296 మంది విద్యార్థులు హాజరయ్యారని (97.5% )ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 556 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News March 6, 2025
SRH ప్లేయర్‌కు గాయం.. రీప్లేస్మెంట్ ఎవరంటే?

ఇంగ్లండ్ క్రికెటర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో అతడిని SRH కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడి స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ విల్లెమ్ ముల్డర్‌ను రూ.75లక్షలకు తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ముల్డర్ 11 టీ20లు, 18 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. 60 వికెట్లు తీయడంతో పాటు 970 రన్స్ చేశారు. ఐపీఎల్ 18వ సీజన్ ఈనెల 22న ప్రారంభం కానుంది.
News March 6, 2025
సహకార సంఘాలను బలోపేతం చేస్తాం: కలెక్టర్

జిల్లాలోని వ్యవసాయ, పాడి, మత్స్య సహకార సంఘాలను పటిష్టపరిచి, సభ్యులకు మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సహకార రంగం ద్వారా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప వివరించారు.
News March 6, 2025
వరుసగా రెండో రోజూ స్టాక్‌మార్కెట్లు అదుర్స్

స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజూ భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,544 (+207), సెన్సెక్స్ 74,340 (+609) వద్ద ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, పాజిటివ్ సెంటిమెంటు పెరగడమే ఇందుకు కారణాలు. రియాల్టీ సూచీ తగ్గింది. O&G, మెటల్, ఎనర్జీ, కమోడిటీస్, PSE, ఫార్మా, ఇన్ఫ్రా, హెల్త్‌కేర్, FMCG షేర్లు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, హిందాల్కో, BPCL, NTPC టాప్ గెయినర్స్. TECHM, BEL, ట్రెంట్ టాప్ లూజర్స్.