News March 6, 2025

నిర్మలా సీతారామన్‌కు అనిత స్వాగతం

image

ఒకరోజు పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ విశాఖ వచ్చారు. స్థానిక విమానాశ్రయంలో ఆమెకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆర్థిక మంత్రితో హోంమంత్రి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర హోం శాఖ చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించారు. గంజాయి రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

Similar News

News March 28, 2026

సిరిసిల్ల: మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేత

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నీటి మట్టం 318 మీటర్ల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 309.56 మీటర్ల వద్ద నమోదైంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.71 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లోలు లేవు.

News March 28, 2026

గద్దర్ సతీమణిని పరామర్శించిన మంత్రి

image

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ సతీమణి విమలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు మంత్రి ఆదేశించారు.

News March 28, 2026

IPL ప్రసారాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం ఎత్తివేత

image

బంగ్లాదేశ్‌లో IPL ప్రసారంపై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపాన్ ప్రకటించారు. ముస్తాఫిజుర్‌ను తొలగించారన్న కారణంతో యూనస్ ప్రభుత్వం IPLను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ లేదా వేరే ఏ ఛానల్ ప్రసారం చేసినా అనుమతిస్తామని జహీర్ తెలిపారు. బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు.