News March 6, 2025
మహిళా శక్తి పథకం గ్రౌండింగ్ పనులను పూర్తి చేయండి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ వంద శాతం పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులతో మహిళా శక్తి పథకం యూనిట్ల లక్ష్యం, బ్యాంక్ లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ఉద్దేశమన్నారు.
Similar News
News July 5, 2025
తోటపల్లి కాలువ ఖరీఫ్ సాగునీటిని విడుదల చేయనున్న మంత్రి

గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయం నుంచి ఖరీఫ్‌కు ఈనెల 6న మంత్రి సంధ్యారాణి నాగావళి సాగునీటిని విడుదల చేస్తారని అధికారులు తోటపల్లి ప్రాజెక్ట్ AE నవీన్ వెల్లడించారు. మండలంలోని ఉల్లిభద్ర సమీప కుడి ప్రధాన కాలువ సున్నా పాయింట్ డైక్ వద్ద మంత్రి గేట్ల వద్ద బటన్ నొక్కి నాగావళి నీరు విడుదల చేస్తారన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
News July 5, 2025
మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: ASF కలెక్టర్

జిల్లాలో చేపట్టిన మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. ఆసిఫాబాద్‌లో నిర్మిస్తున్న జిల్లా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను పంచాయతరాజ్ ఈఈ అజ్మీర కృష్ణతో కలిసి పరిశీలించారు. ఆర్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.
News July 5, 2025
DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్‌గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?