News March 6, 2025
బిలియనీర్లలో భారత్‌కు మూడో స్థానం

ఇండియాలో మిలియనీర్లు, బిలియనీర్లు పెరుగుతున్నారని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. మిలియనీర్ల పరంగా భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా, చైనా, జపాన్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. అలాగే అపర కుబేరుల జాబితాలో ఇండియా మూడో ప్లేస్‌లో ఉన్నట్లు తెలిపింది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. మన దేశంలో 191 మంది బిలియనీర్లు ఉన్నట్లు వెల్లడించింది.
Similar News
News March 10, 2026
BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.
News March 10, 2026
ప్రజలపై భారం.. మీ విద్యుత్ కొనం: NTPCకి రాష్ట్రం లేఖ

TG: బయట చౌకగా దొరుకుతున్నా ఒప్పందం పేరిట ఎక్కువ ధర ఉన్న NTPC విద్యుత్తును కొనేది లేదని రాష్ట్రం ఆ సంస్థకు లేఖ రాసింది. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. అటు సంస్థ నిర్మిస్తున్న 2400MW ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. నిల్వలు ఉంటే సరఫరాపై పరిశీలిస్తామంది. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
News March 10, 2026
మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.


