News March 6, 2025
MNCL: వివాహితపై వేధింపులు.. వ్యక్తిపై కేసు నమోదు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. సీఐ వివరాలిలా.. ఓ గృహిణిని సన్నీ అనే వ్యక్తి గత రెండు వారాలుగా వెంటపడి వేధిస్తున్నాడు. ఈ నెల 3న ఉదయం ఇంటి ముందు నీళ్లు పడుతుండగా అసభ్యకరంగా ప్రవర్తించడంతో సదరు మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Similar News
News February 27, 2026
విజయవాడలో ప్రియుడిని పట్టింటిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్..!

పోలీసుల కళ్లు కప్పి పరారైన నిందితుడిని ఎట్టకేలకు మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు రాజేష్ పోలీసుల నుంచి పరారయ్యాడు. రాజేష్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉండగా ఆమెతో వేరే వారి ఫోన్ నుంచి నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతుండగా సాంకేతిక పరిజ్ఞానంతో అతణ్ని అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.
News February 27, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 27, 2026
రూ. 250 కోట్ల భూమి.. సర్కారు నిర్ణయం ఏమిటో?

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనంతరం.. స్వాధీనం చేసుకున్న 31.07 ఎకరాల వినియోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భూమి విలువ సుమారు రూ. 250 కోట్లు ఉంటుందని కలెక్టరే ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఖరీదైన ఈ భూముల్లో సామాన్యులకు ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాలు లేదా ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.


