News March 6, 2025

VZM: మందు బాబులకు భారీగా ఫైన్

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. విజయనగరం పట్టణ ట్రాఫిక్ సీఐ సూరినాయుడు నగరంలో బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 18 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున 18 మందికి రూ.1.80 లక్షల జరిమానా విధించారని SP వకుల్ జిందాల్ తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.

Similar News

News March 13, 2026

విజయనగరంలో జోయాలుక్కాస్ గ్రాండ్ ఓపెనింగ్

image

విజయనగరంలో జోయాలుక్కాస్‌‌ జువెలరీ షోరూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. వినియోగదారులు ఈ షోరూమ్‌లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్చి 29 వరకు తయారీ ఛార్జీలపై ఫ్లాట్ 40% ప్రారంభ ఆఫర్‌ను అందిస్తున్నట్లు గ్రూప్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు.

News March 13, 2026

VZM: ‘అక్షరాంధ్ర పరీక్షకు 99% హాజరు కావాలి’

image

ఈనెల 15న నిర్వహించనున్న అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 99% హాజరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫిరెన్స్‌ ద్వారా పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో 1.10 లక్షల మందిని అక్షరాంధ్ర కింద గుర్తించామని, వారందరూ అక్షరాస్యులుగా మారాలని అన్నారు. పరీక్ష అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.

News March 13, 2026

15న పారాది రానున్న వైఎస్.షర్మిల

image

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్.షర్మిల ఈనెల 15న బొబ్బిలి మండలం పారాది రానున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ చెప్పారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం పారాదిలో రచ్చబండ నిర్వహిస్తారని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని, షర్మిల రచ్చబండను జయప్రదం చేయాలని కోరారు.