News March 6, 2025

జగిత్యాల: ఎక్కడి సమస్యలు అక్కడే..!

image

గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. అప్పటి నుంచి జగిత్యాల జిల్లాలోని 385 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Similar News

News March 20, 2026

కృష్ణానదిలో బయటపడ్డ సంగమేశ్వరాలయం

image

కృష్ణానదిలో మునిగి ఉన్న ప్రాచీన సంగమేశ్వరాలయం క్రమంగా బయటపడుతోంది. ఉగాది సందర్భంగా ఆలయంలోని నాలుగు గుడులలో దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిచ్చాయి. అర్చకులు రఘురామశర్మ ఆధ్వర్యంలో విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మామిడి తోరణాలతో అలంకరించారు. శుక్రవారం నాటికి శివలింగం కూడా నీటిలో నుంచి బయటపడే అవకాశం ఉందని అర్చకులు తెలిపారు.

News March 20, 2026

ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు కేటాయింపు: మంత్రి దామోదర

image

ప్రభుత్వం ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. శుక్రవారం శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాణ చరిత్రలో ఆరోగ్య శాఖకు ఇదే అత్యధిక కేటాయింపులు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.

News March 20, 2026

‘ధురంధర్-2’తో ఆ డైరెక్టర్లు బెదిరిపోతారు: RGV

image

‘ధురంధర్-2’పై మరోసారి ప్రశంసలు కురిపించిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రొటీన్ సినిమాలు తీసే దర్శకులపై ఫైర్ అయ్యారు. హీరోలను దేవుడిలా కొలుస్తూ ఫిజిక్స్, గ్రావిటీతో సంబంధం లేని చిత్రాలు తీసే డైరెక్టర్లకు ఇది వణుకుపుట్టిస్తుందన్నారు. దీంతో అసలైన హీరోయిజం పుట్టిందని.. ఇప్పుడు రొటీన్ స్టార్ హీరోలంతా జోకర్లుగా కనిపిస్తున్నారని విమర్శించారు. రొటీన్ యాక్షన్ మూవీలను ఇకపై ఆడియన్స్ చూడరని ట్వీట్ చేశారు.