News March 6, 2025
దేశ చరిత్రలోనే అతిపెద్ద మీటింగ్: తుమ్మల

కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కౌడా ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) అధ్యక్షతన పెద్దాపురంలో బుధవారం సాయంత్రం జన సైనికులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ.. మార్చి 14వ తేదీన పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ వేడుకలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద సమావేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 21, 2026
సిద్దిపేటలో యాక్సిడెంట్.. 5ఏళ్ల బాలుడి మృతి

సిద్దిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి మృతిచెందాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాములు, భారతి దంపతులకు వైష్ణవి, గంగారాం(5) పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం వచ్చిన రాములు ఫ్యామిలీతో కలిసి సిద్దిపేట 16వ వార్డులో ఉంటున్నారు. శుక్రవారం గంగారాం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
News March 21, 2026
HYDలో దారుణం.. లవర్‌పై కత్తితో దాడి

మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అలీషా అలియాస్ పాండు తన తండ్రి లాలూతో కలిసి యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు నూకరత్నం (25)ను స్థానికులు వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 21, 2026
శ్రీకాకుళం: రూ.400 చేరిన చికెన్ ధర

రంజాన్ పండుగ సందర్భంగా శ్రీకాకుళం మార్కెట్లో చికెన్ ధర కొండెక్కింది. నిన్నటి వరకు కిలో రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ భారీగా పెరిగి రూ.400కు చేరింది. నగరంలో కిలో స్కిన్లెస్ చికెన్ ₹380-రూ.400 వరకు అమ్ముతున్నారు. చికెన్ విత్ స్కిన్ కేజీ ₹280-300 వరకు విక్రయిస్తున్నారు. రంజాన్ పండగ, ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


