News March 6, 2025

రేపటి నుంచి పంచాయతీల్లో ఆన్‌లైన్ వసూళ్లు

image

AP: పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్‌లైన్ పన్ను వసూలు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. క్యూఆర్ స్కానర్ల ద్వారా సిబ్బంది ఆస్తి, లీజులు, ఇతర పన్నులను వసూలు చేస్తారు. దీనిద్వారా రూ.250 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. కాగా రాష్ట్రంలోని గ్రామాల్లో ఇళ్లు, షాపులు, ఇతర భవనాలు 85 లక్షల వరకు ఉన్నట్లు తేలింది.

Similar News

News January 16, 2026

ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

image

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.

News January 16, 2026

జనవరి 16: చరిత్రలో ఈ రోజు

image

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జననం (ఫొటోలో)
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1988: భారత ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం
2016: బాలీవుడ్ దర్శకుడు అనిల్ గంగూలీ మరణం

News January 16, 2026

జనవరి 30న నీటి వివాదాలపై తొలి కీలక సమావేశం

image

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. AP, TG, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC అధికారులతో కూడిన అధికారిక కమిటీ తొలి సమావేశం జనవరి 30న ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చ జరగనుంది. KRMB, GRMB ప్రతినిధులు కూడా పాల్గొని తాజా పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు.