News March 6, 2025

KNR: పట్టభద్రుల ఎమ్మెల్సీ.. గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అంజిరెడ్డి

image

ఉమ్మడి మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి గెలుపు ధ్రువీకరణ పత్రం బుధవారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

పెద్దపల్లి: మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా మధు

image

పెద్దపల్లి జిల్లా జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా కట్టేకోల మధుని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఆముల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోచం మల్లయ్య, ఉపాధ్యక్షులుగా మద్దెల రామకృష్ణ, మట్ట రాజయ్య, కార్యదర్శులుగా చెవుల రాజయ్య, బండ రాజులను నియమించారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపార

News September 19, 2025

క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

image

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.

News September 19, 2025

తలమడుగు: కలప అక్రమ రవాణా

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్‌లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.