News March 6, 2025
తిరుపతి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

తెలంగాణ, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి వద్ద హైవే 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్ఐ ఆనంద్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి పట్టణ కేంద్రానికి చెందిన రామయ్య కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుకలకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలై రామయ్య(58) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి.
Similar News
News December 10, 2025
విశాఖ: DRO, RDOల నియామకంలో మీనమేషాలు

విశాఖలో రెగ్యులర్ అధికారులను నియమించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. DRO, RDOల మధ్య వివాదం జరగ్గా.. ఇద్దరినీ సరెండర్ చేశారు. 2 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రెగ్యులర్ అధికారులను నియమించలేదు. ఇన్‌ఛార్జ్ హోదాల్లో ఉన్నవారు పెద్ద పెద్ద పనుల విషయంలో తలదూర్చడం లేదు. తాత్కాలికమైన పనులనే చూసుకొని వెళ్లిపోతున్నారు. దీంతో కీలక నిర్ణయాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
News December 10, 2025
తిరుపతి ఐజర్‌లో ఉద్యోగావకాశం

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐజర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా లేబరోటరీ అసిస్టెంట్-1 పోస్టుకు 13వ తేదీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/ డిప్లమా ఇన్ M.L.T పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iisertirupati.ac.in/jobs/advt_762025/ వెబ్ సైట్ చూడాలి.
News December 10, 2025
పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: EC

గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈ మేరకు ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.


