News March 6, 2025
సిద్దిపేట: తండ్రి మరణం.. ‘కూతురికి పరీక్ష’

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వర్గల్‌కు చెందిన పసుల లింగం(50) బైక్‌పై తూప్రాన్ వెళ్లి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ తూప్రాన్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. లింగం కూతురు తేజశ్రీ బుధవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఇంటర్ తొలి రోజు పరీక్ష రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.
Similar News
News March 12, 2026
ఖమ్మం: తీరిన గ్యాస్ గండం.. భోజన కష్టాలు దూరం

యుద్ధ ప్రభావంతో గ్యాస్ ఏజెన్సీలు సరఫరా నిలిపివేయడంతో జిల్లాలోని హాస్టళ్లలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. సిలిండర్ల కొరతతో భోజన తయారీకి ఇబ్బందులు ఎదురవ్వగా.. అ.కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి, వసతి గృహాలకు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భోజనానికి ఆటంకం తొలగిందని, ముందస్తు నిల్వలు పెంచుతున్నామని DBCDO జ్యోతి తెలిపారు.
News March 12, 2026
మహిళా జవాన్‌ను మోసం చేశాడు!

పామిడి(M) రామగిరికి చెందిన లోక్‌నాథ్ (అగ్నివీర్) బెంగాల్‌లో జవాన్‌గా ఉన్న మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇన్‌స్టాలో వీరి మధ్య పరిచయం ఏర్పడగా ఆమె భర్తతో కలహాలు, కుటుంబ విషయాలను పంచుకున్నారు. తాను అండగా ఉంటానని దగ్గరైన లోక్‌నాథ్ పెళ్లి చేసుకుంటానని అనంతపురం రప్పించి లాడ్జిలో లొంగదీసుకున్నాడు. తర్వాత ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై మోసం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
News March 12, 2026
పొదిలి: వామ్మో.. ఇలానూ మోసం చేస్తారా..?

పొదిలిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే సమయంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు లైసెన్స్ లేదు. తనిఖీలు చేయకుండా ఉండాలంటే రూ.60వేలు ఇవ్వండి’ అని కోరగా.. భయపడిన నిర్వాహకుడు రూ.6వేలు ఫోన్ పే చేశాడు. అసలు అధికారి తనిఖీలకు వెళ్లగా.. మీకు డబ్బులు పంపానని నిర్వాహకుడు చెప్పాడంతో ఆయన అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.


