News March 6, 2025

సిద్దిపేట: తండ్రి మరణం.. ‘కూతురికి పరీక్ష’

image

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వర్గల్‌కు చెందిన పసుల లింగం(50) బైక్‌పై తూప్రాన్‌ వెళ్లి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ తూప్రాన్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. లింగం కూతురు తేజశ్రీ బుధవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఇంటర్ తొలి రోజు పరీక్ష రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.

Similar News

News March 18, 2026

లక్ష్యం రూ.56 కోట్లు.. ఇంకా రూ.26 కోట్ల బకాయిలు

image

పట్టణాల్లో ఆస్తి, నీటి పన్ను లక్ష్యాలను చేరుకునేందుకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఉంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ. 30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బకాయిలపై 50% వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో 100% లక్ష్యాలు చేరుకుంటారేమో చూడాల్సి ఉంది.

News March 18, 2026

ధురంధర్-2: ఇంకా థియేటర్లకు చేరని సెకండాఫ్?

image

భారీ అంచనాల మధ్య రేపు విడుదలవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా షోలపై అనుమానాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి కేవలం ఫస్టాఫ్ మాత్రమే థియేటర్లకు చేరినట్లు సమాచారం. క్లైమాక్స్, సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తుండటంతో పూర్తి సినిమా అందడంలో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కంటెంట్ పొందే థియేటర్లు మేనేజ్ చేసినా హార్డ్ డ్రైవ్‌లపై ఆధారపడే సింగిల్ స్క్రీన్లకు కష్టాలు తప్పవు.

News March 18, 2026

WGL: పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృతి

image

ఆడుకుంటూ ఉన్న చిన్నారిని కాలనాగు కాటేయడంతో ఓ కుటుంబంలో తీరని శోకం నిండింది. నెక్కొండ మండలం భూక్యతండాకు చెందిన లావుడ్యా తిరుపతి-సుజాత దంపతుల కుమార్తె కుట్టి(3) మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. పాప నోటి నుంచి నురుగు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. చిన్నారి మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.