News March 6, 2025

నాపై కేసును కొట్టేయండి.. హైకోర్టులో RGV పిటిషన్

image

AP: సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ డైరెక్టర్ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే FIR నమోదు చేశారని ఆయన చెప్పారు. అందులో పేర్కొన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి తెలిపారు. CBFC సర్టిఫికెట్ జారీ చేశాక 2019లో కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ చేశామన్నారు. దీనిపై 2024లో కేసు నమోదు సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

భారత్‌పై మళ్లీ టారిఫ్స్‌.. రెడీ అవుతున్న ట్రంప్?

image

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయనే ఆరోపణలతో భారత్, చైనా సహా 16 దేశాలపై దర్యాప్తునకు ట్రంప్ ఆదేశించారు. గతంలో వివిధ దేశాలపై విధించిన అదనపు టారిఫ్‌లను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విచారణ ఆయా దేశాలు అమెరికా విషయంలో అన్యాయమైన ట్రేడ్ ప్రాక్టీసెస్‌ను అమలు చేస్తున్నాయని నిర్ధారిస్తే మళ్లీ టారిఫ్స్ వేయడం లేదా ఇతర ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

News March 12, 2026

ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

image

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.

News March 12, 2026

కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి..

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్ లేదని, బుక్ చేసినా రావడం లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా కొందరు కట్టెల పొయ్యి వాడుతున్నారు. చెన్నైలో ఓ హోటల్ యజమాని బట్టీ కట్టించుకుని పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించుకున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో ఇప్పటికే కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు.