News March 6, 2025
సంగారెడ్డి: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
Similar News
News March 24, 2026
క్రూడాయిల్, ఎరువులపై ఫోకస్!

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోలియం, ఫర్టిలైజర్స్ శాఖలపై కేంద్రం నిర్వహిస్తున్న కీలక <<19465756>>భేటీ<<>> కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత రాకుండా మొరాకో నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హార్ముజ్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ సరఫరాకు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధనం ఉందని, ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని కేంద్రం తెలిపింది.
News March 24, 2026
KTR, రాజగోపాల్ రెడ్డి భేటీ.. దోస్తీయా? రాజకీయమా?

అసెంబ్లీ లాబీలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుమారు 2 గంటల పాటు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. వీరిద్దరూ కలిసి భోజనం చేస్తూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ MLA పాయల్ శంకర్ కూడా కొద్దిసేపు వీరితో ముచ్చటించారు. ఇటీవల పలు శుభకార్యాల్లోనూ రాజగోపాల్ రెడ్డి.. కేటీఆర్, హరీశ్ రావులను కలవడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
News March 24, 2026
NTR: బీటెక్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిసెంబర్ 2025లో నిర్వహించిన IV/IV బీటెక్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.


