News March 22, 2024
గోనెగండ్లలో విషాదం.. ఈతకు వెళ్లి బాలుడి మృతి

గోనెగండ్లలోని లక్ష్మీపేటలో జరిగే ఒక పెళ్లికి ఎమ్మిగనూరు మండలం మల్కాపురానికి చెందిన ఎల్లారెడ్డి కుటుంబంతో పాటు వారి కుమారుడు అరుణ్ కుమార్(6) వచ్చాడు. పెళ్లి సందడిలో ఉండగా అరుణ్ కుమార్ కొంతమంది పిల్లలతో కలిసి సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్థానికులు బాలుడిని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News July 9, 2025
కర్నూలు మాజీ ఎంపీకి గోల్డ్ మెడల్

కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
News July 9, 2025
మద్దికేరలో ఆక్సిండెంట్.. ఒకరి మృతి

మద్దికేరలోని బురుజుల రోడ్డులో రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడిని కైరుప్పలకు చెందిన తిరుమల యాదవ్(24)గా పోలీసులు గుర్తించారు. గుంతకల్లు మండలం గుళ్లపాలెంలో భార్యను చూసి సొంతూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ నాయక్ తెలిపారు.
News July 9, 2025
నిషేధిత పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్ధల సమీపంలోని 100 గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత పదార్ధాలు అమ్మడం నిషేధించామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. నిషేధిత వస్తువులను షాప్ నిర్వాహకులు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులకు అవగాహన కల్పించారు.