News March 6, 2025

ఆసిఫాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు వరకూ అవకాశముందన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.

Similar News

News April 18, 2026

గుంటూరులో క్రికెట్ బెట్టింగ్.. ఆరుగురి అరెస్ట్!

image

గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రోడ్డులోని MSగ్రాండ్‌లో బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు రూ. 7,400 లిక్విడ్ క్యాష్, రూ. 1,54,000 ఆన్‌లైన్ క్యాష్‌ని పోలీసులు సీజ్ చేశారు.

News April 18, 2026

నాడు శ్రీకాకుళం కలెక్టర్.. నేడు స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఉత్తమ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ చంద్ర పునేఠా నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. 1993-96 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సీఎస్ స్థాయికి చేరారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించింది.

News April 18, 2026

WGL: రూ.2.5 కోట్ల మోసం.. మిర్చి వ్యాపారి అరెస్ట్

image

ఏనుమాముల మార్కెట్‌లో అడ్తిదారులను మోసం చేసిన మిర్చి వ్యాపారి లడే తిరుపతిని పోలీసులు అరెస్టు చేశారు. గాయత్రి చిల్లీస్ పేరిట వ్యాపారం చేస్తూ 49 మందితో మిర్చి కొనుగోలు చేసి, అదే సరకును ఇతరులకు విక్రయించి సుమారు రూ.2.5 కోట్లతో పరారయ్యాడు. ఈ నెల 2న విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. దేశాయిపేట వద్ద అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఆయన భార్య మాధవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.