News March 22, 2024
మిగతా నగరాలకూ బెంగళూరు పరిస్థితేనా?

తగిన చర్యలు తీసుకోకుంటే ఇతర ప్రాంతాలకూ బెంగళూరు తరహాలో నీటి ఎద్దడి తప్పవంటున్నారు నిపుణులు. ప్రస్తుతం దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు 38% మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకతో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, MP, త్రిపుర, రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర, UP, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది.
Similar News
News February 7, 2026
పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లారు: CM

TG: ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసు ఇవ్వకపోతే ఏం చేస్తారని సీఎం రేవంత్ అన్నారు. ‘తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చామని కొందరు అంటున్నారు. తప్పు చేస్తే బేడీలు వేసి లాక్కొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు’ అని పరిగి బహిరంగ సభలో తెలిపారు.
News February 7, 2026
రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR

TG: రేవంత్ ఎప్పటికైనా BJP మనిషేనని KTR ఎద్దేవా చేశారు. కామారెడ్డి(D) బాన్సువాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ కాంగ్రెస్ నేత కాదు బడే భాయ్ తమ్ముడు. కాంగ్రెస్ నుంచి ప్రయోజనాలు పొందిన వాళ్లే వారికి ఓటేయాలి. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. కచ్చితంగా కాంగ్రెస్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం. ఆయన విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో దూరారు’ అని విమర్శించారు.
News February 7, 2026
1291 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 1291 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి 3 వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. BSc/BA/B.Com, టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి FEB 20 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18-24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. DV కోసం FEB 26న పిలుస్తారు. వెబ్‌సైట్: https://iocl.com


