News March 6, 2025
ఆత్మకూరులో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.
Similar News
News March 4, 2026
ఈరోజు నమాజ్ వేళలు (04-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.21 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.24 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.36 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 4, 2026
శుభ సమయం (4-3-2026) బుధవారం

➤ తిథి: బహుళ పాడ్యమి సా.4.33 వరకు తదుపరి విదియ ➤ నక్షత్రం: పుబ్బ ఉ.7.37 వరకు, తదుపరి ఉత్తర ➤ శుభ సమయాలు: ఉ.6.17-8.14, ఉ.9.13-10.12, మ.12.33-మ.2.59, సా.4.39-5.02 వరకు ➤ రాహుకాలం: మ.12.00-1.30 వరకు ➤ యమగండం: ఉ.7.30-9.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.11.46-మ.12.32 వరకు ➤ వర్జ్యం: మ.3.00-సా.4.38 ➤ అమృత ఘడియలు: రా.12.50 నుంచి 2.48 వరకు
News March 4, 2026
సాగర్ ఎడమకాలువలో ఇద్దరు యువకుల గల్లంతు

హాలియా పట్టణంలో వాగు సమీపంలో ముగ్గురు యువకులు బిర్యానీ తిని సాగర్ ఎడమ కాలువలో చేతులు కడుక్కోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు కాలుజారి పడిపోవడంతో పక్కనే ఉన్న స్నేహితుడు రక్షించడానికి కాలువలోకి దిగి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని మూడో యువకుడు గ్రామానికెళ్లి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారు పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న వారు స్థానిక ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.


