News March 6, 2025

కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

image

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News September 16, 2025

ఆస్కార్ విన్నర్, హాలీవుడ్ ఐకాన్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ మృతి

image

హాలీవుడ్ లెజెండ్, ఆస్కార్ అవార్డు విన్నింగ్ నటుడు & డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ (89) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు రాబర్ట్ సన్నిహితుడు సిండి బెర్గర్ వెల్లడించారు. 1960 నుంచి ఇంగ్లిష్ సినిమాలకు ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడిగా సేవలందించారు. కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.

News September 16, 2025

దేవాదాయ భూముల్లో ఉత్సవ్‌పై హైకోర్టు ఆగ్రహం

image

దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్‌ నిర్వహించడంపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని, ఆ భూముల్లో మట్టి, కంకర, గ్రావెల్‌ వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 56 రోజులకు తమ ఆధీనంలోని భూములను దేవాదాయశాఖ లీజుకు ఇవ్వగా.. ఆ భూములను యథాస్థితికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

News September 16, 2025

చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాలు సేకరిస్తాం: భాస్కర్

image

దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.