News March 6, 2025
ఆత్మకూరులో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.
Similar News
News November 3, 2025
13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు. అక్టోబర్ 25న లీప్ యాప్‌లో అటెండెన్స్ మార్కు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 3, 2025
గ్రామాల్లో నీటి సమస్య ఉండకూడదు: కలెక్టర్

గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్యలు ఉండకూడదని కలెక్టర్ డా.ఏ.సీరి ఆర్ డబ్ల్యుూఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఆమె పలు అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ శాఖ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
News November 3, 2025
భక్తులు అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలు, నదీతీరాలకు తరలి వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మహిళలు దీపాలు వెలిగించి వాటిని నదుల్లో వదిలే సమయంలో, స్నానాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, చిన్న పిల్లలతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓర్వకల్ శ్రీ కాల్వబుగ్గ, రామేశ్వర, బ్రహ్మగుండేశ్వర, నందవరం దేవాలయంలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


