News March 6, 2025

విజయవాడ: ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’

image

నెల్లూరుకు చెందిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు మ్యాట్రీమోని ద్వారా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. విజయవాడకు చెందిన అమీర్‌ఖాన్ పరిచయమయ్యాడు. తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని నమ్మించి రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద తీసుకున్నాడు. ఈ క్రమంలో భర్త అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్‌ అని తెలియడంతో భార్య ప్రశ్నించగా.. దాడి చేశాడు. దీంతో ఆమె నెల్లూరు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 31, 2025

2025: రెండు రోజులకో అవినీతి కేసు

image

TG: ఈ ఏడాది సగటున రెండు రోజులకు ఒక అవినీతి కేసు నమోదైనట్లు ACB తెలిపింది. మొత్తంగా 199 కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. ట్రాప్ కేసుల్లో 176 ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టయ్యారని, మొత్తంగా 273 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. సోదాల్లో రూ.96.13 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను, రూ.57.17 లక్షల నగదును గుర్తించామంది.
* అవినీతిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106

News December 31, 2025

ఈ ఏడాది క్రీడల్లో రాణించిన అమ్మాయిలు

image

ఈ ఏడాది అన్ని రంగాల్లో అతివలు రాణించారు. ముఖ్యంగా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్, అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్, కబడ్డీ వరల్డ్ కప్, రోల్ బాల్ WC గెలిచారు. హాకీ ఆసియా కప్‌, అథ్లెటిక్స్, వరల్డ్ బాక్సింగ్ కప్‌లోనూ భారత నారీమణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వీటితో పాటు షూటింగ్ నుంచి చెస్ వరకు, గోల్ఫ్ నుంచి బాక్సింగ్ వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలిచి స్ఫూర్తిని నింపారు.

News December 31, 2025

OpenAI ఉద్యోగుల సగటు వేతనం ₹13.4 కోట్లు!

image

టెక్ స్టార్టప్ చరిత్రలోనే OpenAI సరికొత్త రికార్డు సృష్టించింది. తన ఉద్యోగులకు ఒక్కొక్కరికీ సగటున ఏడాదికి $1.5 మిలియన్ల (సుమారు ₹13.48 కోట్లు) విలువైన స్టాక్ ఆధారిత జీతాలు ఇస్తోంది. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు IPOకి వెళ్లేముందు ఇచ్చిన దానికంటే ఇది 7 రెట్లు ఎక్కువ. AI రంగంలో టాలెంట్ కోసం పోటీ పెరగడంతో మెటా వంటి కంపెనీల నుంచి తమ వారిని కాపాడుకోవడానికి OpenAI ఈ భారీ ప్యాకేజీలు ఇస్తోంది.