News March 6, 2025
బీజేపీలోకి సీఎం రేవంత్‌ను ఆహ్వానిస్తాం: అరవింద్

TG: CM రేవంత్ BJPలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని BJP MP ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనను పార్టీలోకి తీసుకుంటారా? లేదా? అనేది తన చేతుల్లో లేదన్నారు. రేవంత్‌ను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన అలా చేస్తే CM స్థాయిలో రేవంత్ చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అటు కేంద్రం నిధులిస్తున్నా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలను MP ఖండించారు.
Similar News
News March 6, 2025
నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారని తెలిసింది. 338 నామినేషన్లలో 244 వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నాయని నోబెల్ కమిటీ పేర్కొంది. అందులో ఆయన పేరునూ చేర్చామని వెల్లడించింది. సాధారణంగా నామినేట్ అయిన పేర్లను కమిటీ రహస్యంగా ఉంచుతుంది. ఒకవేళ అదే స్వయంగా నామినేట్ చేస్తే చెప్తుంది. శాంతి బహుమతికి ట్రంప్ కన్నా అర్హులు ఇంకెవరూ ఉండరని రిపబ్లికన్ పార్టీ అంటోంది. మీరేమంటారు?
News March 6, 2025
YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు

AP: Dy.CM పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ సీఎం జగన్‌పై జనసేన కార్యకర్తలు ఏలూరు(D) ద్వారకా తిరుమల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ అని నిన్న జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
News March 6, 2025
ఇండియాకు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారు: రాణా

తనను ఇండియాకు అప్పగించొద్దని ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఒకవేళ అప్పగిస్తే ఆ దేశం తనను చిత్రహింసలు పెడుతుందని, అప్పగింతపై స్టే ఇవ్వాలని కోరాడు. 2023 మానవ హక్కుల నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం మైనారిటీలపై వివక్ష చూపుతోందని తెలిపాడు. కాగా రాణా ప్రస్తుతం LA జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలని కోరగా ట్రంప్ ఓకే చెప్పారు.