News March 6, 2025

సామర్లకోట: ఇద్దరు టీచర్లు సస్పెండ్

image

సామర్లకోటలో ఇద్దరు టీచర్లు సస్పెండయ్యారు. వేట్లపాలెం హైస్కూళ్లో పనిచేసే ఎస్. వెంకటరమణ, నాంచారీదేవిలను డీఈవో సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. వారిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేలచడంతో వేటు పడనట్లు సామర్లకోట ఎంఈవో వై. శివరాంకృష్ణయ్య, HM అనురాధ తెలిపారు.

Similar News

News September 16, 2025

ASF: ‘కొమరం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి’

image

ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం 85వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కెరెమెరి మండలం జోడేఘాట్‌లో కుమ్రం భీం 85వ వర్ధంతిని పురస్కరించుకొని ఐటీడీఏ పీవో ఖుష్బూ, జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాశ్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి హెలిప్యాడ్, వర్ధంతి, దర్బార్ ఏర్పాట్లపై పరిశీలించారు.

News September 16, 2025

అనకాపల్లి జిల్లాలో 12,362 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

image

అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు రైతులకు 12,362 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా 845 మెట్రిక్ టన్నుల ఏరియా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. మరో 610 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు కేటాయించినట్లు పేర్కొన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన పడవద్దని సూచించారు. ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించాలన్నారు.

News September 16, 2025

OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్‌లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.