News March 22, 2024
బొబ్బిలి: మూడురోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతి
గుండెపోటుతో బొబ్బిలిలో హోం గార్డు కెంగువ మహేష్ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మూడురోజులు క్రితం తమ్ముడు రామారావు మృతి చెందడంతో ఒత్తిడికి గురై తీవ్ర అస్వస్థత గురయ్యారు. కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. మూడు రోజులు వ్యవధిలో అన్నదమ్ములు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 17, 2024
VZM: జిల్లాలో నిఘానేత్రాన్ని పటిష్ఠం చేస్తున్నాం: SP
జిల్లాలోని ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపులు, కాలేజ్‌లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని SP వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అదనంగా మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా షాపు యజమానులకు, వ్యాపారవేత్తలకు, అపార్టుమెంట్ వాసులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణకు డ్రోన్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు.
News November 17, 2024
హిందూస్థాన్ టైమ్స్ సదస్సులో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఎంపీ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సదస్సులో చంద్రబాబు ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుందని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని, కింజరాపు పాల్గొన్నారు.
News November 16, 2024
VZM: విద్యాశాఖకు కలెక్టర్ కీలక ఆదేశాలు
ఈ నెల 20 లోపు 1 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్ధులందరికీ అపార్ ఐడీలు జనరేట్ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో యాక్షన్ టేకాన్ రిపోర్ట్‌పై విద్యా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆధార్ సమస్యను పరిష్కరించుకొని వెంటనే అపార్ ఐ.డిలను జారీ చేయాలని సూచించారు. బడి బయట ఉన్న 6 సంవత్సరాల పైబడిన బాలల వివరాలను, బడి బయట ఉండడానికి గల కారణాలను తెలపాలన్నారు.