News March 6, 2025

కౌలు రైతులకు ‘అన్నదాత సుఖీభవ’: అచ్చెన్నాయుడు

image

AP: రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. సీఆర్‌సీ కార్డులు లేకుండానే ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నవారికి సాయం అందిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ.9,400 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

Similar News

News March 6, 2025

సుప్రీం కోర్టుకు చేరిన TN హిందీ పంచాయితీ

image

TN, కేరళ, బెంగాల్‌లో జాతీయ విద్యా విధానం (NEP) అమలుకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. రాజ్యాంగం ప్రకారం అవి NEP అమలు చేయాలని, ఇందుకు MOU కుదుర్చుకున్నాయని పిటిషన్ వేసిన అడ్వకేట్ మణి అన్నారు. దీనిపై TN CM స్టాలిన్ వ్యతిరేకత అవాస్తవం, రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. పాలసీ అమలుపై రాష్ట్రాలను ఆదేశించే హక్కు సుప్రీంకోర్టుకు లేనప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కలగజేసుకోవచ్చన్నారు.

News March 6, 2025

IPL ఫ్యాన్స్‌కు అలర్ట్.. రేపటి నుంచే టికెట్ బుకింగ్స్

image

‘IPL-2025’ టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈక్రమంలో హైదరాబాద్‌లో జరిగే తొలి రెండు మ్యాచులకు సంబంధించిన టికెట్లను రేపటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు SRH ప్రకటించింది. 23న SRHvsRR, 27న SRHvsLSG మ్యాచ్‌లు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. రెండు టికెట్లకు ఒక జెర్సీ ఫ్రీగా ఇస్తారు.

News March 6, 2025

‘సూపర్ 6’కు కేటాయింపులు ఏవి?: అంబటి

image

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకూ నిధులు లేవా? అని ఎద్దేవా చేశారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని విమర్శించారు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పిన నేతలు కేటాయింపులు ఎందుకు చేయలేదని నిలదీశారు. CMగా ఉన్న వ్యక్తి పక్కపార్టీ వారికి సాయం చేయొద్దని చెబుతారా? అని ప్రశ్నించారు.

error: Content is protected !!