News March 6, 2025
గూడూరు: ‘ఇసుకలో తల ఇరుక్కొని చనిపోయాడు’

MHBD జిల్లా గూడూరు మండలం చిర్రకుంట తండాలో బుధవారం వ్యక్తి మరణించడంతో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంటతండాకు చెందిన భూక్య రాజ్ కుమార్ తన వ్యవసాయ పంట పొలాల్లో కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్నాడు. కాగా, కోతులు ఆవాసం ఏర్పరచుకున్న చెట్టు కొమ్మలను నరికి వేసే క్రమంలో చెట్టు పైనుంచి జారిపడ్డాడు. చెట్టు కింద వాగు ఇసుకలో తల కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News March 6, 2025
గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ బొల్లా మోహన్ రావు దుర్మరణం చెందారు. వాహనంలో ఉన్న ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 6, 2025
ఒంగోలు: 30 మండలాలకు అధ్యక్షుల ప్రకటన

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని 30 మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు షేక్. సైదా ప్రకటించారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలని అన్నారు. షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు.
News March 6, 2025
NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.