News March 6, 2025
ఎస్.రాయవరం: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్‌లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Similar News
News March 6, 2025
వచ్చే సంక్రాంతి మామూలుగా ఉండదుగా!

సంక్రాంతి వచ్చిందంటే చాలు టాలీవుడ్‌లో సినిమాల పండుగ మొదలవుతుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుంచే పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆ టైమ్‌కి NTR-NEEL, చిరంజీవి- అనిల్ రావిపూడి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’, రవితేజ- కిశోర్, వెంకటేశ్ -సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చే సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సారి మొత్తం మూడు సినిమాలు రిలీజవగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అధిక వసూళ్లు రాబట్టింది.
News March 6, 2025
నిర్మల్: 2nd ఇయర్ పరీక్షకు 296 గైర్హాజరు

గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,102 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,172, ఒకేషనల్ విభాగంలో 634 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా, 296 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
News March 6, 2025
దేశానికి న్యాయం జరిగేలా చరిత్రను రాయలేదు: నిర్మల

చరిత్రను జరిగింది జరిగినట్లుగా చెప్పాల్సిన సంస్కృతి మనదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘గతంలో చరిత్ర రాసిన వాళ్లు దేశానికి న్యాయం జరిగేలా రాయలేదు. దేశంపై ఆధిపత్యం చెలాయించిన వాళ్లు తమకు అనుకూలంగా చరిత్రను రాసుకునే ప్రయత్నం చేశారు. చరిత్రను వక్రీకరించడం పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది’ అని పేర్కొన్నారు.