News March 6, 2025
BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2026
సూర్యలంక బీచ్‌కి పోటెత్తిన పర్యాటకులు

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో ఆదివారం పర్యాటకుల తాకిడి అధికంగా మారింది. రంజాన్ మరసటి రోజు ముస్లింలు సముద్ర తీరాలకు అధికంగా విచ్చేస్తారు. అదేవిధంగా ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు బాపట్ల మండలం విచ్చేయడంతో సముద్రతీరం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. తీరం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News March 22, 2026
ADB: ఈ నెల 27 నుంచి కందుల కొనుగోలు బంద్

కేంద్ర ప్రభుత్వ సంస్థ (నాఫేడ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మార్క్ ఫెడ్) కందుల కొనుగోలు చేయడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని మార్క్ ఫెడ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌లలో కందుల కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు 27 నుంచి తమ కందులను మార్కెట్ యార్డ్‌లకు తీసుకురావద్దని సూచించారు.
News March 22, 2026
హన్మకొండ: 11 మందిలో గెలిచింది ఒక్కడే!

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 11 మంది న్యాయవాదులు బరిలో నిలిచారు. ఇందులో సీనియర్ న్యాయవాది ఎం సహోదర రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో న్యాయవాది సహోదర్ రెడ్డి 1085 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. సహోదర్ రెడ్డి విజయంతో వరంగల్ కోర్టులో సంబరాలు నెలకొన్నాయి.


