News March 6, 2025
BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 12, 2025
RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో RCB సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే RCB తమ మ్యాచులను హోమ్ గ్రౌండ్‌లో ఆడకపోవడం ఇదే తొలిసారి కానుంది. అటు సొంత టీమ్ అభిమానులకు నిరాశే మిగలనుంది.
News November 12, 2025
కోనసీమ: టెన్త్ విద్యార్థులకు alert..షెడ్యూల్ విడుదల

2025-26 విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో సలీంబాషా తెలిపారు. రెగ్యులర్, ఫెయిల్ అయిన వారు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 13 – 25 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు చెల్లించవచ్చన్నారు.
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<


