News March 6, 2025
పెద్దపల్లి: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటల (సుమారు 60 గంటలు) వరకు సాగింది.
Similar News
News March 11, 2026
పాలమూరు: ఈనెల 16న ఖో ఖో క్రీడాకారుల ఎంపిక

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న మహిళలు, 17న పురుషుల ఖో ఖో జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. వర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థులు (17-25 ఏళ్ల వారు) పాల్గొనవచ్చు. ఇక్కడ ఎంపికైన వారు ఆల్ ఇండియా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన పేర్కొన్నారు.
News March 11, 2026
రేపు సూర్యాపేట జిల్లాకు రానున్న మంత్రి ఉత్తమ్

రేపు (మార్చి 12) మధ్యాహ్నం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేటలో సాయిబాబా టెంపుల్ సమీపంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు.
అనంతరం హుజూర్నగర్ నియోజకవర్గంలో 2160 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించి అధికారులతో చర్చించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.
News March 11, 2026
రైల్వేపై LPG ప్రభావం.. ఫుడ్ డెలివరీలో అంతరాయం!

భారత్‌లో LPG కొరత రైల్వే వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది. రైళ్లలో భోజన సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ ఆర్డర్ చేసినవారికే ప్రయారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అటు ప్రత్యామ్నాయ వంట పద్ధతులకు మారాలని స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్, జన్ ఆహార్ అవుట్‌లెట్లకు IRCTC లేఖ రాసింది. ఈ సంస్థ రోజుకు 17 లక్షల భోజనాలు డెలివరీ చేస్తోంది.


