News March 6, 2025

MNCL: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

Similar News

News March 2, 2026

పులి సంచారంపై భయాందోళన వద్దు: కలెక్టర్

image

పోలవరం జిల్లాలోని వేములకొండ, అకూరు గ్రామాల్లో పులి సంచారంపై భయాందోళన చెందవద్దని కలెక్టర్ దినేశ్ కుమార్ భరోసా ఇచ్చారు. సోమవారం సాయంత్రం తమ గోడు వెళ్లబోసుకున్న గ్రామస్థులతో ఆయన మాట్లాడారు. అటవీ అధికారుల పర్యవేక్షణలో పులి కదలికలను గమనిస్తున్నామని, అది జనవాసాల్లోకి రాదని స్పష్టం చేశారు. అటవీ శాఖతో నిరంతరం సంప్రదిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News March 2, 2026

ములుగు ప్రజావాణిలో 59 వినతులు

image

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి 59 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, పింఛన్ల కోసం 14, ఉద్యోగ కల్పనకు 4, ఇతర సమస్యలపై 13 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచకూడదన్నారు.

News March 2, 2026

KMR: రాహుల్ గాంధీ మూటల కోసం వచ్చారు: కేంద్ర మంత్రి

image

రాహుల్ గాంధీ శిక్షణా తరగతుల పేరుతో హైదరాబాద్‌కు వచ్చింది కేవలం మూటల కోసమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూసీ సుందరీకరణ కోసం ఇండ్లను కూల్చివేసిన బాధితుల ఇండ్ల వద్దకు రాహుల్ గాంధీ వెళ్లాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల ప్రాంతాలను, ఖమ్మంలోని ప్రాంతాలను సందర్శించాలన్నారు.