News March 6, 2025
NZB: ఒకే రోజు నలుగురు మృతి.. జర జాగ్రత్త..!

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం ఒక్క రోజు వివిధ గ్రామాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో అంజవ్వ, డొంకేశ్వర్ మండలం అన్నారంలో చిన్నారెడ్డి, ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌లో శ్రీనివాస్, రామారెడ్డిలో మానస మరణించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News January 13, 2026
నిజామాబాద్: వారికి కలెక్టర్ హెచ్చరిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటి కార్యక్రమానికి గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మొదటి తప్పుగా భావించి మెమోలిస్తున్నామని, పునరావృతమైతే వేతనాల్లో కోతతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.
News January 13, 2026
NZB: మున్సిపోల్.. మహిళా ఓటర్లే అధికం

మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. NZB కార్పొరేషన్‌లో మొత్తం ఓటర్లు 3,48,051 మంది ఉండగా.. మహిళలు 1,80,546, పురుషులు 1,67,461,
బోధన్‌లో మొత్తం ఓటర్లు 69,417 మంది కాగా మహిళలు 35,720, పురుషులు 33,696,
భీమ్‌గల్‌లో మొత్తం 14,045 మంది ఓటర్లు ఉండగా మహిళలు 7,429, పురుషులు 6,616,
ఆర్మూర్‌లో మొత్తం ఓటర్లు 63,972 మంది ఉండగా మహిళలు 33,322, పురుషులు 30,648, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
News January 13, 2026
నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్..!

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిసారించింది. మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా, టీపీసీసీ చీఫ్‌గా ఉండటంతో నిజామాబాద్ నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున టార్గెట్ మిస్ కావొద్దని భావిస్తోంది. అవసరమైతే ఎంఐఎంతో దోస్తీతో మేయర్ సీటు కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది.


