News March 6, 2025
నిజామాబాద్ జిల్లాలో వింత పరిస్థితి.. పగలు ఎండ.. రాత్రి చలి!

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నా.. రాత్రిళ్లు చలి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కానీ రాత్రయ్యే సరికి చలి విరుచుకుపడుతోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని సిరికొండ మండలం తూమ్పల్లిలో 9.3℃ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిలో ఎండతో పాటు చలికి కూడా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News March 6, 2025
NZB: 420 మంది విద్యార్థుల గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 420 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,343 మంది విద్యార్థులకు 15,923 మంది పరీక్షలకు (97.4 శాతం) హాజరయ్యారని తెలిపారు. ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బీ సెంటర్‌లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా పట్టుకున్నారన్నారు.
News March 6, 2025
NZB: ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

డిచ్పల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి, పరీక్షల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా గట్టి నిఘాతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు.
News March 6, 2025
NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.