News March 6, 2025
కడప: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

వైయస్సార్ కడప జిల్లా పరిధిలోని ఎర్రగుంట్ల సమీపంలో గురువారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చిలంకూరు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ (58), వెంకట ఆంజనేయులు(55) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 12, 2025
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు విద్యార్థి

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు చాపాడు హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి టి. చంద్రశేఖర్ ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు పి. వెంకటలక్ష్మి తెలిపారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో చంద్రశేఖర్ 58 కేజీల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థి ఉత్తమ ప్రతిభ చూపడం పట్ల ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, పీడీ ఓబయ, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News September 11, 2025
చాపాడు: మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

మాల్కంబీ రాష్ట్ర స్థాయి పోటీలకు చాపాడు మండల నరహరిపురం పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నరసింహ శాస్త్రి తెలిపారు. మైదుకూరు మేధా డిఫెన్స్ అకాడమిలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ఐ (మాల్కంబీ) క్రీడలలో జిల్లా స్థాయి పోటీల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు అండర్ 17 విభాగంలో వి. సుబ్బలక్ష్మి (10వ తరగతి), కె. మస్తాన్ వల్లి (9వ తరగతి) ఎంపిక అయ్యారని తెలిపారు.
News September 11, 2025
ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.