News March 6, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ 

image

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వంశీ సరిగ్గా సహకరించలేదని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తులు పరారీలోనే ఉన్నారు. 

Similar News

News March 25, 2026

కృష్ణా: 9 పరీక్షా కేంద్రాలను సందర్శించిన డీఈఓ

image

కృష్ణా జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి యువీ సుబ్బారావు తెలిపారు. బుధవారం ఆయన జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పామర్రు, ఉయ్యూరు మండలాల్లో తొమ్మిది కేంద్రాలను ఆయన సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు.

సౌత్ ఇండియా ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు

image

కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే దక్షిణ భారత విశ్వవిద్యాలయాల పురుషుల ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు బుధవారం బయలుదేరింది. జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ప్రిన్సిపాల్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మేక రమేశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణారెడ్డి, కోచ్ మనోహర్ పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.