News March 6, 2025
తాండూరు: ఇంటర్ పరీక్ష హాల్లో పాము

తాండూరులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సాహంగా పరీక్షా హాల్‌లోకి వెళ్లిన విద్యార్థులు పరుగులు తీశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలోని ఏ బ్లాక్ రూం నంబర్ 3లో పాము ప్రత్యక్షమైంది. కేకలు వేస్తూ విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. పామును కొట్టి చంపేశారు.
Similar News
News March 25, 2026
పుట్టపర్తి కలెక్టరేట్‌లో డీఐపీసీ సమీక్ష

పుట్టపర్తి కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. వివిధ శాఖ ద్వారా పరిశ్రమలకు రావాల్సిన అనుమతులను మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గతేడాది విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిపై సమీక్షించారు. అవసరమైన భూమిని కేటాయించాలని ఆదేశించారు.
News March 25, 2026
నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని సార్లపల్లి, కుడిచింతల బైలు గ్రామాల తరలింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని అందజేసింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వాసిత కుటుంబాలకు రూ.15 లక్షల విలువైన చెక్కులతో పాటు భూమి పత్రాలను పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్యుతాపురం ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News March 25, 2026
యురేనియం నిల్వలపై క్లారిటీ ఇవ్వండి: MP బాలశౌరి

కడప జిల్లా తుమ్మలపల్లె వద్ద 4,400 టన్నుల యురేనియం నిల్వలు అదనంగా లభించాయన్న దానిపై స్పష్టత ఇవ్వాలని మచిలీపట్నం MP వల్లభనేని బాలశౌరి బుధవారం నిర్వహించిన పార్లమెంట్ సమావేశంలో కేంద్రాన్ని కోరారు. యూరేనియం నిల్వలు లభించడం వాస్తవమే అయితే అందుకు సంబంధించి వివరాలు వెల్లడించాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి 2024-25, 2025-26లో 4400 టన్నుల ఇన్-సిటు యురేనియం ఆక్సైడ్ వనరును వృద్ధి చేశామని పేర్కొన్నారు.


