News March 6, 2025

ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

image

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.

Similar News

News March 11, 2026

ఈరోజు నమాజ్ వేళలు (11-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 11, 2026

ఖమ్మం: వెలుగుమట్ల నిరాశ్రయులకు తీపికబురు

image

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ నిరాశ్రయులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 412 మందిని అర్హులుగా గుర్తించి, వీరిలో 311 మందికి బుధవారం ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనుంది. మిగిలిన 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటికే రెవెన్యూ అధికారులు అర్హులైన బాధితులకు టోకెన్లు జారీ చేశారు.

News March 11, 2026

NTR: PG విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో పీజీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నానో టెక్నాలజీ మినహా మిగతా కోర్సుల పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1లోపు రూ.100 ఫైన్‌తో 2లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.