News March 6, 2025
మిల్లర్ సిక్స్.. బంతితో స్టేడియం నుంచి పరార్!

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో విచిత్రమైన సంఘటన జరిగింది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్సర్ కొట్టారు. దీంతో బంతిని పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు లాహోర్ స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఐసీసీ ఈవెంట్లో ఇలా జరగడం మొదటిసారి అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, టీమ్‌ను గెలిపించేందుకు మిల్లర్ చేసిన పోరాటం అనిర్వచనీయమని నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
Similar News
News March 6, 2025
బాబర్ ఆజమ్‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం

CTలో విఫలమైన పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను విమర్శించిన మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌పై ఆయన తండ్రి ఆజమ్ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2024 ICC T20 టీమ్‌లో ఉన్న ప్లేయర్‌ను నేషనల్ T20 జట్టు నుంచి తొలగించారు. PSLలో రాణించి అతడు కమ్‌బ్యాక్ ఇస్తాడు. అతడిని విమర్శించే మాజీ క్రికెటర్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నా. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే మీరు తట్టుకోలేరు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
News March 6, 2025
రన్యారావు తండ్రిపై గతంలో ఆరోపణలు

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి <<15652905>>రన్యారావు<<>> తండ్రి రామచంద్రరావు (DGP) కర్ణాటక హౌసింగ్ కార్పొరేషన్ CMDగా ఉన్నారు. 2014లో ఈయన IGPగా ఉన్నప్పుడు కేరళకు వెళ్తున్న బస్సును మైసూరు దగ్గర ఆపి రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. అయితే అందులో రూ.2.27 కోట్లు ఉన్నాయని, పోలీసులు డబ్బును పక్కదారి పట్టించారని ఆ వ్యాపారులు వెల్లడించారు. ఈ కేసును సీఐడీ విచారించింది. కొన్ని రోజులకు ఆయనకు వేరే పోస్టింగ్ ఇచ్చారు.
News March 6, 2025
21 Years: అమెరికాలో భయం గుప్పిట్లో భారతీయ యూత్!

H4 వీసా కింద మైనర్లుగా అమెరికాకు వలసవెళ్లిన భారతీయులు భయం భయంగా బతుకుతున్నారు. వారికి 21 ఏళ్లు వస్తుండటమే ఇందుకు కారణం. H1B వీసా కలిగిన తల్లిదండ్రుల వద్ద వారు ఇకపై డిపెండెంట్లుగా ఉండలేరు. సాధారణంగా H4 నుంచి ఇతర వీసాలు పొందేందుకు గతంలో రెండేళ్ల గడువు ఉండేది. ఇప్పుడా విధానం రద్దు చేశారు. FY26 H1B వీసా ప్రక్రియకు కేవలం 17 రోజులే టైమిచ్చారు. దీంతో యువత UK, కెనడా వంటి దేశాలకు వెళ్లాలని భావిస్తోంది.