News March 6, 2025

నేటి నుంచి 10 విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు

image

పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 6న తెలుగు, 7న హిందీ, 10న ఇంగ్లీష్, 11న గణితం, 12న భౌతిక, రసాయన శాస్త్రం, 13న జీవ శాస్త్రం, 15న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ప్రశ్నాపత్రాలను ఎమ్మార్సీ కార్యాలయం నుంచి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

ఇరాన్ అటాక్‌తో ఖతర్‌కు ₹9.3లక్షల కోట్ల నష్టం!

image

ఇరాన్ చేసిన దాడులతో ఖతర్‌ ఏటా $20 బిలియన్ల (₹1.86లక్షల కోట్లు) వార్షిక ఆదాయం కోల్పోయిందని ఖతర్ ఎనర్జీ సీఈవో వెల్లడించారు. దీని ప్రభావం ఐదేళ్ల పాటు ఉండి.. మొత్తం ₹9.3లక్షల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. ఈ దాడులతో ఖతార్ LNG ఎగుమతి సామర్థ్యం 17% తగ్గిందని.. ఏటా 12.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గనుందని తెలిపారు. దీంతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న దేశాలకు LNG సరఫరా సవాల్‌గా మారిందన్నారు.

News March 19, 2026

భద్రాద్రి రామయ్య పెళ్లికి వేళాయె..!

image

భద్రాద్రి క్షేత్రంలో ఈ నెల 27న మిథిలా స్టేడియం వేదికగా జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, మహా పట్టాభిషేకం, రథోత్సవం, తెప్పోత్సవాలు, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.

News March 19, 2026

KNR: గ్యాస్ భయంతో.. కట్టెల పొయ్యిపైకి మళ్లిన జనం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత భయంతో ప్రజలు మళ్లీ పాతకాలపు విధానాలకు మళ్లుతున్నారు. గ్యాస్ బుక్ చేస్తే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుండడంతో ప్రజలు గ్యాస్‌ను పొదుపుగా వాడుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందోనన్న ఆందోళనతో, కొంతమంది కుటుంబాలు కట్టెల పొయ్యిలను వాడడం ప్రారంభించారు. నేడు ఉగాది పండుగ సందర్భంగా కట్టెలపైన భక్షాలు, పిండి వంటలు చేస్తూ కనిపించారు.