News March 6, 2025
ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.
Similar News
News March 6, 2025
21 Years: అమెరికాలో భయం గుప్పిట్లో భారతీయ యూత్!

H4 వీసా కింద మైనర్లుగా అమెరికాకు వలసవెళ్లిన భారతీయులు భయం భయంగా బతుకుతున్నారు. వారికి 21 ఏళ్లు వస్తుండటమే ఇందుకు కారణం. H1B వీసా కలిగిన తల్లిదండ్రుల వద్ద వారు ఇకపై డిపెండెంట్లుగా ఉండలేరు. సాధారణంగా H4 నుంచి ఇతర వీసాలు పొందేందుకు గతంలో రెండేళ్ల గడువు ఉండేది. ఇప్పుడా విధానం రద్దు చేశారు. FY26 H1B వీసా ప్రక్రియకు కేవలం 17 రోజులే టైమిచ్చారు. దీంతో యువత UK, కెనడా వంటి దేశాలకు వెళ్లాలని భావిస్తోంది.
News March 6, 2025
గంభీర్, రోహిత్ అలా.. షమీ ఇలా

CTలో IND తన మ్యాచులన్నీ దుబాయ్‌లోనే ఆడటం అడ్వాంటేజ్‌గా మారిందని పేసర్ షమీ అన్నారు. ‘ఒకే గ్రౌండ్‌లో ఆడుతుండటం మాకు హెల్ప్ అవుతోంది. పిచ్ కండిషన్స్, బిహేవియర్ గురించి తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఈ అంశంపై గంభీర్, రోహిత్ భిన్నంగా స్పందించారు. పిచ్ కండిషన్స్ ప్రతీ మ్యాచుకు మారుతున్నాయని, తాము ప్రాక్టీస్ చేసే ICC అకాడమీ, మ్యాచ్ ఆడే దుబాయ్ గ్రౌండ్ పిచ్‌లు డిఫరెంట్ అని పేర్కొన్నారు.
News March 6, 2025
NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.