News March 6, 2025

NPS వాత్సల్య’తో పిల్లలకు మంచి భవిష్యత్తు: PFRDA ఛైర్‌పర్సన్

image

NPS వాత్సల్య పథకంలో ఇప్పటివరకూ లక్షమంది చేరినట్లు PFRDA ఛైర్‌పర్సన్ దీపక్ మహంతి వెల్లడించారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే లక్షమంది చేరినందుకు ధన్యవాదాలు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువులను ఇందులో చేర్చవచ్చన్నారు. పిల్లల భవిష్యత్తుకు ఇది మంచి స్కీం అని తెలిపారు. ఈ పథకాన్నికేంద్రం గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించింది. 18సంవత్సరాల లోపు పిల్లలు ఇందులో చేరడానికి అర్హులు.

Similar News

News March 16, 2026

పశ్చాత్తాపం అంటే ఇదేనేమో.. దొంగిలించిన నగలను తిరిగిచ్చాడు!

image

AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఓ వింత ఘటన జరిగింది. ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరైన దంపతుల బంగారు నగలను కాజేశాడో దొంగ. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు’ అనుకున్నాడో ఏమో.. 20 రోజుల తర్వాత ఆ నగలను బాధితుల ఇంటికే కొరియర్‌లో పంపించాడు. ఇంటి ముందున్న పార్సిల్ చూసి షాకైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వేలిముద్రల ఆధారంగా దొంగ ఎవరో తేల్చేపనిలో పోలీసులున్నారు.

News March 16, 2026

ఏ పార్టీలో చేరాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు: రాజాసింగ్

image

TG: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను BJLP ఛాంబర్‌కి వెళ్లడంపై MLA రాజాసింగ్ స్పందించారు. ‘పాత ఇల్లు, పాత ఫ్రెండ్స్ కాబట్టి వెళ్లా. ఇంకా ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ అవ్వలేదు. ఎవరిని ఎవరు బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా BJLP ఛాంబర్ నుంచి వస్తున్న రాజాసింగ్‌ను చూసిన KTR ‘BJP నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి అక్కడికి ఎలా వెళ్లారు?’ అని సరదాగా ఆటపట్టించారు.

News March 16, 2026

నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

image

TG: ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది. ‘అనిమేష’తో పాటు ఆయా భాషల్లోని రచయితల సాహిత్య పుస్తకాలకు అవార్డులను ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబించే కావ్యమిది. అప్పటి పరిస్థితులను అక్షరరూపంలో కళ్లకు కట్టేలా రచయిత ఆవిష్కరించారు.