News March 6, 2025
తగ్గిన బంగారం ధరలు!

రెండు రోజులుగా దాదాపు రూ.1360 పెరిగిన బంగారం ధర ఈరోజు కాస్త తగ్గి సామాన్యుడికి ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది.
Similar News
News March 6, 2025
ఏపీకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల

APకి ఏ లోటు లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామన్నారు. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇప్పిస్తున్నామని వెల్లడించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సాయం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్నింటా కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
News March 6, 2025
ప్రభాస్‌కు గాయం? టీమ్ ఏం చెప్పిందంటే..

స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయమైందని, కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్‌లకు దూరమవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌కు ఎలాంటి గాయం కాలేదని, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరింది. కాగా ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడటంతో తీవ్ర గాయమైందని, ఇటలీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పలు సైట్లు వార్తలు ప్రచురించాయి.
News March 6, 2025
రోడ్డు ప్రమాదాలకు ఇంజినీర్లే కారణం: గడ్కరీ

రోడ్డు ప్రమాదాలకు సివిల్ ఇంజినీర్ల తప్పులే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీపీఆర్, రోడ్డు డిజైన్లు సరిగా చేయట్లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్స్ లాంటి చిన్న పనులు కూడా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనం స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.