News March 6, 2025

సిద్దవటం: ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం

image

మండలంలోని ఉప్పరపల్లె గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. శేఖరాజుపల్లె రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే సంఖ్య 421/1, 424 లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇక్కడ సుమారు 50 సెంట్లను ఇటీవల స్థానికుడు యంత్రంతో చదును చేసి ఆక్రమించాడు. ఈ విషయమై ఇన్‌ఛార్జ్ MRO మాధవీ లతను వివరణ కోరగా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 18, 2026

కడప జిల్లాలో ఓపెన్ 10th పరీక్షలు.. 387 మంది డుమ్మా..!

image

జిల్లాలో బుధవారం 31 కేంద్రాల్లో ఓపెన్ టెన్త్ పరీక్షలు నిర్వహించారు. నేడు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం 2,356 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 1,969 మంది మాత్రమే పరీక్ష రాశారు. 387 మంది విద్యార్థులు పరీక్షకు డుమ్మా కొట్టినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కడప మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాల కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

News March 18, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,530
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ. 14,288
*వెండి 10 గ్రాముల ధర రూ.2,575

News March 18, 2026

కడప జిల్లాలో రైతుల నుంచి వసూళ్లు ఎంత..?

image

కడప జిల్లాలో రైతుల నుంచి MSPతో పంటల కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5,732 మంది శనగ రైతులు వీటిలో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 3,143 మంది రైతుల నుంచి 13,078.5 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశారు. బస్తాకు రూ.150 – రూ.200లు మామూళ్లు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రూ.3, 4 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.