News March 6, 2025

FLASH: RGVకి హైకోర్టులో ఊరట

image

AP: డైరెక్టర్ ఆర్జీవీకి హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై 2024లో కేసు నమోదు చేయడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై FIR నమోదు చేశారని, దీన్ని కొట్టేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Similar News

News March 6, 2025

విశాఖ, విజయవాడ మెట్రోలపై చర్చించా: సీఎం

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులపై చర్చించానని సీఎం ట్వీట్ చేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై సమాలోచనలు చేశామన్నారు. ఇవి రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.

News March 6, 2025

ఏపీకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల

image

APకి ఏ లోటు లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామన్నారు. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇప్పిస్తున్నామని వెల్లడించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సాయం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్నింటా కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

News March 6, 2025

ప్రభాస్‌కు గాయం? టీమ్ ఏం చెప్పిందంటే..

image

స్టార్ హీరో ప్రభాస్‌‌ కాలికి గాయమైందని, కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్‌లకు దూరమవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌‌కు ఎలాంటి గాయం కాలేదని, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరింది. కాగా ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడటంతో తీవ్ర గాయమైందని, ఇటలీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పలు సైట్లు వార్తలు ప్రచురించాయి.

error: Content is protected !!